: విజయ పాల ధరలు మళ్లీ పెరుగుతున్నాయ్..!
విజయ పాల ధరలు మళ్లీ పెరగనున్నాయి. కృష్ణాజిల్లా విజయవాడ కేంద్రంగా విజయా పాల ఉత్పత్తిదారుల సహకార సమితి ఆధ్వర్యంలో తయారయ్యే ఈ పాలు వినియోగదారుల చెంతకు చేరుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విక్రయాలు జరిగే విజయా పాలు ఇక నుంచి మరింత ప్రియం కానున్నాయి. పాల కొనుగోలు ధర, నిర్వహణా వ్యయం పెరిగిన నేపథ్యంలో పార ధరలను పెంచాలని విజయా పాల సహకార సమితి నిర్ణయించింది. జనవరి 10వ తేదీన విజయ గోల్డ్ పాల ధర లీటరుకు రెండు రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. మళ్లీ వారం రోజుల్లో లీటరుకు రెండు రూపాయల చొప్పున విజయ పాల ధరలు పెరగనున్నాయి.
పెరిగిన ధరలు ఈ నెల 20వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. పెరిగిన ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
విజయ లోఫాట్ (డిటిఎం) అరలీటరు ప్యాకెట్ 18 రూపాయలు, విజయ ఎకానమి (టోన్డ్ మిల్క్) అరలీటరు 19, విజయ ప్రీమియం (స్టాండర్డ్) అరలీటరు 20 రూపాయలు. ఇక విజయ ఆవు పాలు అరలీటరు 20, విజయ స్పెషల్ అరలీటరు 23, విజయ గోల్డ్ అరలీటరు 24 రూపాయలు.