: సీబీఐ కోర్టులో లొంగిపోయిన శ్రీలక్ష్మి, ఈనెల 26వరకూ రిమాండ్
ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఇవాళ సీబీఐ కోర్టులో లొంగిపోయారు. తన ఆరోగ్యం బాగా లేదంటూ శ్రీలక్ష్మి పేర్కొన్న నేపధ్యంలో ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని కోర్టు అధికారులకు ఆదేశాలిచ్చింది. శ్రీలక్ష్మికి ఈనెల 26వరకూ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.