: జన్ లోక్ పాల్ బిల్లును ప్రవేశపెట్టిన కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జన్ లోక్ పాల్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. అయితే, ఆ సమయంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభాపతికి లెఫ్టినెంట్ గవర్నర్ రాసిన లేఖపై ఓటింగ్ నిర్వహించాలని కాంగ్రెస్, బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. జన్ లోక్ పాల్ బిల్లుపై చర్చించాలని కేజ్రీవాల్ విపక్షాలకు సూచించారు. బిల్లుపై చర్చకు స్పీకర్ అనుమతించారు. విపక్షాల నిరసనలు వ్యక్తం చేయడంతో అసెంబ్లీ అరగంట పాటు వాయిదా పడింది.