: నెట్ లో టీచర్ నగ్న ఫొటోలు.. ఐఐటీ విద్యార్థి ఘనకార్యం


సుర్జీత్ కుమార్ జైన్ (18) ఎంతో కష్టపడి చదివి ఖరగ్ పూర్ ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో సీటు సంపాదించాడు. కానీ బుద్ది మాత్రం వక్రమార్గం పట్టింది. తన జిల్లాకే చెందిన ఓ టీచర్ నగ్న చిత్రాలను నెట్ లో పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇంటర్నెట్ ప్రొటోకాల్ ఆధారంగా ఖరగ్ పూర్ ఐఐటీలో సుర్జీత్ కుమార్ జైన్ అనే విద్యార్థి అప్ లోడ్ చేసినట్టు గుర్తించారు. దీంతో వారు ఖరగ్ పూర్ ఐఐటీకి వెళ్లారు. అయితే, సుర్జీత్ కుమార్ గత రెండు నెలలుగా క్లాసులకు హాజరుకావడం లేదని ఐఐటీ డైరెక్టర్ వెల్లడించాడు. దీంతో సుర్జీత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News