: కుమ్మేస్తామంటున్న 'కుర్రాళ్ళు'


క్రికెట్ లో భారత సీనియర్ జట్ల కంటే జూనియర్ జట్లు సాధించిన విజయాలు తక్కువేంకాదు. అండర్-19 స్థాయిలో ఏ అగ్రశ్రేణి జట్టునూ వదలకుండా కుమ్మేశారు మనవాళ్ళు. ఒకప్పుడు మహ్మద్ కైఫ్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ, ఈ మధ్య ఉన్ముక్త్ చంద్.. వీరందరూ తమ కెప్టెన్సీలో భారత జూనియర్ టీమ్ ను ఉన్నతస్థానంలో నిలిపారు. ఇప్పుడు మరో అండర్-19 ప్రపంచకప్ నేడు ఆరంభం కానుంది. యూఏఈ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. ఇక, భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను మొదటి మ్యాచ్ లో ఎదుర్కోనుంది. రేపు జరిగే ఈ మ్యాచ్ కు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక.

కాగా, మ్యాచ్ పై యువకిశోరం సంజూ శాంసన్ మాట్లాడుతూ, ఈ టోర్నీలో తాము తప్పక కొట్టాల్సిన జట్టేదైనా ఉందంటే అది పాకిస్తానే అని చెప్పాడు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్ లోనూ ఫైనల్లో పాక్ ను 40 పరుగుల చిత్తు చేసిన మన కుర్రాళ్ళు, వరల్డ్ కప్ లోనూ అదే జోరు కనబర్చాలని భావిస్తున్నారని శాంసన్ పేర్కొన్నాడు. ఆసియా కప్ లో 8 జట్లను ఎదుర్కొన్నామని, ఇక్కడ 15 జట్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని వివరించాడు. ఈ భారీ టోర్నీ కోసం మెరుగ్గానే సన్నద్ధమయ్యామని తెలిపాడీ కేరళ క్రికెటర్. గత ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించిన శాంసన్ కీలక ఇన్నింగ్స్ లతో క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ వంటి వారి ప్రశంసలకు పాత్రుడయ్యాడు.

  • Loading...

More Telugu News