: భక్తులతో నిండిపోయిన రేవు పోలవరం సముద్రతీరం
విశాఖ జిల్లాలోని రేవు పోలవరం సముద్ర తీరం ఇవాళ జనసంద్రంగా మారింది. మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఎస్.రాయవరం మండల పరిధిలోని రేవు పోలవరం సముద్రతీరానికి భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలాచరించిన అనంతరం కుటుంబ సమేతంగా లక్ష్మీమాధవ స్వామివారిని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు.