: ముసుగుతన్నిన అమెరికా
అగ్రరాజ్యం అమెరికాను మంచు వణికిస్తోంది. కొద్దిరోజులుగా జనజీవనాన్ని స్థంభింపజేసిన మంచు తీవ్రతకు ఇప్పటివరకు 21 మంది మరణించారు. 6500 విమానాలు ఎయిర్ పోర్టుకే పరిమితం అయ్యాయి. ఈశాన్య రాష్ట్రాల్లో స్కూళ్ళకు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. 12 లక్షల గృహాలు అంధకారంలో మునిగిపోయాయి. వాషింగ్టన్ డీసీలో 9 అంగుళాలు, న్యూయార్క్ లో 10 అంగుళాల మేర హిమపాతం నమోదైంది. అత్యధికంగా న్యూజెర్సీలో 11 అంగుళాల మేర మంచు కురిసింది. కాగా, న్యూయార్క్ లో ఓ మంచు తొలగించే వాహనం ( స్నో ప్లౌ) ఢీకొని గర్భిణీ మృతి చెందడం అందరినీ కలచివేసింది.