: చేసింది తప్పే.. కానీ తప్పలేదు: లగడపాటి
లోక్ సభలో నిన్న జరిగిన ఘటన పట్ల విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విచారం వ్యక్తం చేశారు. అలాంటి పనులు ఎవరు చేసినా తప్పేనని, కానీ తప్పలేదని చెప్పారు. తన సహచర ఎంపీపై దాడి జరుగుతుంటే, తాను అడ్డుకోవడానికి వెళ్లానని... కానీ దాదాపు వంద మంది ఎంపీలు తనపై దాడికి ప్రయత్నించారని... వారితో పోరాడలేక, విధిలేని పరిస్థితుల్లోనే పెప్పర్ స్ప్రేను ఉపయోగించానని వివరించారు. ఇలాంటి ఘటన జరిగి ఉండాల్సింది కాదని లగడపాటి విచారం వ్యక్తం చేశారు. అయితే, ఘటనకు దారితీసిన పరిస్థితులను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.