: చంద్రబాబు మాయలో పడకండి.. బీజేపీకి ఎంపీ గుత్తా హితవు
తెలంగాణకు కట్టుబడి ఉన్నామన్న బీజేపీ ఇప్పుడు మాటమారుస్తోందని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి, రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని బీజేపీని కోరారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో బీజేపీలోనే అభిప్రాయ బేధాలున్నాయని... అద్వానీ, సుష్మ, రాజ్ నాథ్ లు తలోమాట మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు మాయలో బీజేపీ పడితే వారు మోసపోయినట్టేనని తెలిపారు. సమన్యాయం అంటున్న చంద్రబాబు... ఏంచేయాలన్న విషయం మాత్రం చెప్పడం లేదని విమర్శించారు. ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.