: ప్రాణాలు నిలిపే ఔషధం.. మన శాస్త్రవేత్తల కృషి ఫలితం


రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రవాహానికి అడ్డుపడినా.. రక్తం గడ్డకట్టినా.. గుండె పోటుతో ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుంది. సత్వరమే వారిని ఆస్పత్రికి తీసుకెళితే వైద్యులు రక్తప్రవాహానికి అడ్డుపడిన గడ్డలను విచ్చిన్నం చేయడానికి ఇన్ఫ్యూజన్ ఎక్కిస్తారు. ఇది పూర్తి అవడానికి గంటకుపైగా సమయం పడుతుంది. కానీ, ఆ స్థితిలో ప్రతీ నిమిషం చాలా విలువైనది.

సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గడ్డలను కరిగించే ఒక ఇంజక్షన్ ఉంటే..? అవును మన భారత శాస్త్రవేత్తలు ఇలాంటి ఇంజక్షన్ నే తయారు చేశారు. నిమిషంలో దీన్ని రోగికి ఇచ్చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఔషధాన్ని మనుషులపై రెండో దశ పరీక్షల నిర్వహణకు అనుమతి లభించిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు చెందిన మైక్రోబయాలజీ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ గిరీష్ సాహ్ని తెలిపారు. 2016లో దీన్ని విడుదల చేసే అవకాశాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర ఔషధాల కంటే తక్కువ ధరలో రూ.2వేలకే లభిస్తుందన్నారు.

  • Loading...

More Telugu News