: రాష్ట్రం సమైక్యంగా ఉంటే సంతోషం: బొత్స సత్యనారాయణ
తెలంగాణపై భారతీయ జనతాపార్టీ ఏ టర్న్ తీసుకున్నా.. రాష్ట్రం సమైక్యంగా ఉంటే సంతోషమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన ఈరోజు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ.. ఇంత తీవ్రమైన విభజన అంశం ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు చిన్న విషయమని, దీనిపై చర్చ అనవసరమని బొత్స అన్నారు.
ఈరోజు (గురువారం) పార్లమెంటులో జరిగిన పరిణామాలు దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు జరగాల్సినవి కావని బొత్స అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ కేంద్రానికి లేఖ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ అంశాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూస్తున్నారని ఆయన చెప్పారు.