: లేపాక్షి నాలెడ్జ్ సిటీకి రాయితీలు, సదుపాయాల నిలిపివేత
అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్ సిటీకి రాయితీలు, సదుపాయాలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టరును ప్రభుత్వం ఆదేశించింది. 22 పేజీల సుదీర్ఘమైన లేఖ ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.