: ఆత్మరక్షణ కోసమే స్ప్రే వాడాను... కావాలనుకుంటే ఫుటేజీ చూడండి: లగడపాటి
పార్లమెంటులో గొడవ జరిగిన అనంతరం, కనపడకుండా పోయిన లగడపాటి రాజగోపాల్ మీడియా ముందుకు వచ్చారు. సభలో జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సభలో సభ్యులపై దాడి జరిగిందని... ఆత్మరక్షణ కోసమే లోక్ సభలో పెప్పర్ స్ప్రే ఉపయోగించానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఎవరిది తప్పో, అసలు ఏమి జరిగిందో వీడియో ఫుటేజీ చూస్తే తెలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా విచిత్రంగా తయారైందని... సమస్య పరిష్కారం కోసం సొంత మంత్రులతో చర్చించదు కానీ, ప్రతిపక్షంతో మాత్రం చర్చలు జరుపుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గేమ్ ఆడుతోందని ఆరోపించారు. టీడీపీ ఎంపీలపై కూడా సభలో దాడి చేశారని చెప్పారు. మమ్మల్ని సస్పెండ్ చేయడం కాదు... వెల్ లోకి వచ్చిన సభ్యులందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.