: సెన్సార్ చేయని క్లిప్పింగులు బయటపెడితే నిజాలు తెలుస్తాయి: ఉండవల్లి


పార్లమెంటులో ఏమి జరిగిందన్న నిజం తెలియాలంటే లోక్ సభ సమావేశాలను ప్రసారం చేసిన లోక్ సభ టీవీ క్లిప్పింగులను సెన్సార్ చేయకుండా ఇవ్వాలని ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ ఫుటేజీతో అసలు విషయం ప్రజలకు తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని కొడుతుంటే మేము అడ్డుకునే ప్రయత్నం చేశామని... పరిస్థితి అదుపుతప్పిన పరిస్థితుల్లోనే పెప్పర్ స్ప్రేను లగడపాటి వాడారని తెలిపారు. మరి దాన్ని ఆయనే తీసుకొచ్చారా? లేక వేరేవాళ్లదా? అనే విషయం తెలుసుకోవడానికి... లగడపాటి ఎక్కడున్నారో తెలియడం లేదని చెప్పారు. ఇలాంటివి మరోసారి జరగకుండా ఉండేలా చూడాలని స్పీకర్ కార్యాలయాన్ని కోరతామన్నారు. ఎంపీలను సస్పెండ్ చేయడంపై మాట్లాడుతూ, ఎవరిని ఎందుకు సస్పెండ్ చేస్తున్నారో వారికే అర్థంకావడం లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీబిల్లుపై పార్లమెంటులో ఏం జరుగబోతుందో ఎవరూ చెప్పలేరని తెలిపారు.

  • Loading...

More Telugu News