: యూవీకి రూ.14కోట్ల పాటపై విజయ్ మాల్యా ఫిర్యాదు
నిన్న జరిగిన ఐపీఎల్ వేలం పాటలో యువరాజ్ సింగ్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ 14 కోట్లకు సొంతం చేసుకోగా.. దానిపై వివాదం నెలకొంది. వేలం పాటలో తప్పిదం కారణంగా తాము యూవీపై 4 కోట్ల రూపాయలు అధికంగా పాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాయల్ చాలెంజర్స్ యజమాని విజయ్ మాల్యా ఐపీఎల్ పాలకమండలికి ఫిర్యాదు చేశారు. యూవీపై 10 కోట్లు పాడగా వేలం ముగిసినట్లు ప్రకటించారని.. ఇంతలోనే కోల్ కతా నైట్ రైడర్స్ తాము కూడా పోటీలో ఉన్నామని ప్రకటించగా.. తిరిగి మళ్లీ వేలం కొనసాగించారని.. దాంతో ధర రూ.14కోట్లకు చేరిందని మాల్యా అభ్యంతరం వ్యక్తం చేశారు.