: కేజ్రీ ఆదేశాలతో ముకేశ్ అంబానీ, కేంద్ర మంత్రిపై కేసు
స్వదేశీ గ్యాస్ ఉత్పత్తి ధరను 2014 ఏప్రిల్ నుంచి రెట్టింపు చేయడంలో కుమ్మక్కయ్యారంటూ వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, మాజీ పెట్రోలియం మంత్రి మురళీ దేవ్ రా, హైడ్రోకార్బన్స్ విభాగం మాజీ డైరెక్టర్ సిబల్ పై ఢిల్లీ అవినీతి నిరోధక విభాగం కేసు నమోదు చేసింది. కేజీబేసిన్ లో ఉన్న గ్యాస్ క్షేత్రాల నుంచి ఉత్పత్తిని తగ్గించడం ద్వారా రిలయన్స్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిందని, తద్వారా ధర పెంచుకునేలా చేసిందని, ఈ విషయంలో వీరంతా కుమ్మక్కయ్యారననే ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదేశాల మేరకు భారతీయ కుబేరుడు, దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ, కేంద్ర మంత్రి, మాజీ కేంద్ర మంత్రిపై ఏసీబీ అధికారులు కేసు దాఖలు చేయడం విశేషం.