: ప్రముఖ దర్శకుడు బాలు మహేంద్ర మృతి


ప్రముఖ దర్శకుడు, ఛాయాగ్రాహకుడు బాలు మహేంద్ర(74) కన్ను మూశారు. గుండె నొప్పిగా ఉందని ఈ ఉదయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే ఆయన్ని చెన్నైలోని విజయ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఉదయం పదకొండు గంటలకు ఆయన మరణించారు. కళాత్మక చిత్రాలను రూపొందించడంలో పేరుపొందిన బాలు మహేంద్ర ఐదు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఛాయాగ్రాహకుడిగా తమిళ చిత్రసీమలో ప్రవేశించిన మహేంద్ర అనంతర కాలంలో దర్శకుడిగా మారి 'వసంత కోకిల', 'సతీలీలావతి' సహా 24 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా, శంకరాభరణం, మనవూరి పాండవులు, సీతాకోకచిలుక వంటి పలు తెలుగు, తమిళ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పని చేశారు.

  • Loading...

More Telugu News