: కేంద్ర మంత్రులు మళ్లీ రిపీట్ చేశారు
కేంద్ర మంత్రులు మరోసారి నిన్నటి ఘటనను పునరావృతం చేశారు. సాక్షాత్తూ ప్రధాని మన్మోహన్ సింగ్ తో భేటీ అయిన కేంద్ర మంత్రులు... సభలో సీమాంధ్రులను ఎలా నిలువరించాలనే దానిపై కసరత్తు చేశారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులను సభకు ఆటంకం కల్పించవద్దని స్పష్టంగా ఆదేశించింది. అయినప్పటికీ సీమాంధ్ర కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణి వెల్ లోకి వెళ్లి నిరసన తెలిపారు. పార్టీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మరోసారి కేంద్ర మంత్రులు లోక్ సభలో వ్యవహరించడంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగుతోంది.