: జేపీకి చంద్రబాబు ఓదార్పు
లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో నిన్న (మంగళవారం) జేపీపై తెలంగాణవాదులు ఘోరంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై బాబు ఆయనను అడిగి తెలుసుకున్నారు. కాగా, దాడికి నిరసనగా హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద నేడు లోక్ సత్తా శ్రేణులు ఆందోళన పట్టాయి. వారికి టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు.