: ఢిల్లీలో బీజేపీ నేతలతో ముగిసిన ప్రధాని విందు సమావేశం
ఢిల్లీలో భారతీయ జనతాపార్టీ జాతీయ నేతలతో ప్రధాని మన్మోహన్ సింగ్ విందు సమావేశం ముగిసింది. ఈ భేటీకి లాల్ కృష్ణ అద్వానీ, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ విందు సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి కమల్ నాథ్ కూడా పాల్గొన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రకటించారు. అయితే, సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించిన తర్వాతే విభజన చేపట్టాలని, అప్పుడే టీ-బిల్లుకు మద్దతునిస్తామని బీజేపీ నేతలు తేల్చి చెప్పారు.
సమావేశం ముగిసిన అనంతరం కమల్ నాథ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముసాయిదా బిల్లుకు బీజేపీ మద్దతు ప్రకటించిందని కమల్ నాథ్ తెలిపారు. తెలంగాణ బిల్లు లోక్ సభకు ఎప్పుడు వచ్చేది ఇంకా నిర్ణయించలేదని ఆయన చెప్పారు. సభలో ప్రవేశపెట్టే అంశాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని కమల్ నాథ్ తెలిపారు.