: శ్రీవారి సేవలో తరించాలనుకునేవారికి ఉచిత శిక్షణ
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల వేంకటేశుని పాదసన్నిధిలో తరించాలనుకునే వారికి టీటీడీ శిక్షణనిస్తుంది. ఇందుకుగాను ఓ కరిక్యులమ్ ను తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ విడుదల చేసింది. అయితే, సేవకులు విధిగా ఏడాది పాటు శ్రీవారికి సేవలందించాల్సి ఉంటుందని టీటీడీ షరతు విధించింది. అందుకు ముందుకు వచ్చేవారికి శిక్షణ అనంతరం సేవకులుగా గుర్తింపు నిస్తామని తెలిపింది.