: ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? : మోదుగుల


పార్లమెంటులో నిరసన తెలిపే హక్కు లేదంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని టీడీపీ ఎంపీ మోదుగుల అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, అధికారంలో ఉన్నామని నచ్చినట్టు చేస్తామంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. నిరసన తెలుపుతుంటే అడ్డుకోవాల్సింది స్పీకర్ కానీ, తెలంగాణ నేతలు కాదన్న విషయాన్ని వారు గుర్తించాలని ఆయన సూచించారు. తెలంగాణ నేతలు నిరసలు తెలిపినప్పుడు తాము అభ్యంతరం చెప్పలేదని, కానీ ఇప్పుడు వారు మాత్రం నేరుగా తమతో ఘర్షణకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. మంధా జగన్నాధం దౌర్జన్యానికి దిగడం సరైన పద్ధతా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని వద్దని తాము అనడం లేదని, అయితే తమకు న్యాయం చేసి రాష్ట్ర విభజన చేయాలని అంటున్నామని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News