: చిత్తూరులో రహదారుల దిగ్బంధం..కిలో మీటర్ల మేర నిలిచిన వాహనాలు
తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టడాన్ని నిరసిస్తూ ఏపీఎన్జీవోలు చిత్తూరు నగరంలో చెన్నై,బెంగళూరు 4వ నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. సోనియా దేశానికి పట్టిన శని అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారుల దిగ్బంధంతో కిలోమీటర్ల పొడవున వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి.