: సీఎం పని పూర్తైంది.. అందుకే రాజీనామా నాటకం: భూమన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజనకు పూర్తిగా సహకరించిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పని పూర్తైనందున రాజీనామా అంటూ నాటకాలాడుతున్నారని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాదులోని అసెంబ్లీలోని మీడియా పాయింట్ లో మాట్లాడుతూ, ఇప్పుడు ఎవర్ని ఉద్దరించడానికి సీఎం రాజీనామా చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడే రాజీనామా చేసి ఉంటే ఇంత వరకు పరిస్థితి దాపురించి ఉండేదా అని నిలదీశారు. పదవిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించాలనే ఆలోచన ఇప్పటికి పూర్తయిందని అందుకే రాజీనామా చేస్తానని అంటూ కొత్త నాటకానికి తెరతీశారని ఆయన విమర్శించారు.