: అలనాటి హాలీవుడ్ బాలనటి కన్నుమూత
అప్పట్లో పలు హాలీవుడ్ చిత్రాల్లో బాలనటిగా ఆకట్టుకున్న షిర్లే టెంపుల్ కన్నుమూసింది. ఆమె వయసు 85 సంవత్సరాలు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షిర్లే శాన్ ఫ్రాన్సిస్కోలోని తన నివాసంలో గతరాత్రి బంధుమిత్రులందరూ చుట్టూ ఉండగా తుదిశ్వాస విడిచింది. చిన్ననాట ఉంగరాల జట్టు, పాలుగారే చెక్కిళ్ళతో ఆకర్షణీయంగా ఉండే షిర్లే 1934లో 'స్టాండ్ అప్ అండ్ చీర్!' అనే చిత్రంతో లైమ్ లైట్లోకి వచ్చింది. నటించడమే గాకుండా, అందంగా పాడగలగడం షిర్లేకి పెద్ద ఎస్సెట్. 1935లో ప్రత్యేక అకాడమీ అవార్డు ఆమెను వరించింది. 1960లో షిర్లే సినిమా రంగం నుంచి తప్పుకుంది.