: ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకునేందుకే బహిష్కరణ: సబ్బం హరి


ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకునేందుకే కాంగ్రెస్ అధిష్ఠానం తమను బహిష్కరించిందని ఎంపీ సబ్బం హరి అన్నారు. దీని ద్వారా బిల్లును అడ్డుకుని, వ్యతిరేకంగా ఓటువేసే స్వేచ్చ కల్పించి కాంగ్రెస్ తమకు మేలే చేసిందన్నారు. అంతేకాక పార్లమెంటులో తమ వాణిని వినిపించకుండా ఆపలేరని, బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు తమను అడ్డుకునే వారుండరని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 15 రోజుల్లో బిల్లు పార్లమెంటుకు రాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని సబ్బం అన్నారు. ఈ నెల 24 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందన్న సబ్బం, తాము ఆరుగురే కాకుండా మిగతా ఎంపీలు కూడా తమతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News