: బీహార్ లో ఒకే రోజు మోడీ, లాలూల ప్రసంగాలు?


సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్చి ఐదున బీహార్ లోని ముజఫర్ పూర్ లో మోడీ భారీ ర్యాలీ జరగనుంది. ఈ నేపథ్యంలో మోడీకి వ్యతిరేకంగా అదే రోజు పార్టీ కార్యకర్తలతో బీహార్ లో భారీ బహిరంగ సభను చేపట్టాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై లాలూ పార్టీ ఎంపీ రామ్ కృపాల్ యాదవ్ మాట్లాడుతూ, లాలూ బహిరంగ సభ మోడీ సభ కంటే పెద్దదిగా ఉంటుందని చెప్పారు. బీహార్ లో లాలూ మాస్ లీడర్ కాబట్టి, మోడీ ర్యాలీ కంటే ఎక్కువగా ప్రజలను ఆకర్షిస్తారని చెప్పారు.

  • Loading...

More Telugu News