: తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని బీజేపీని కోరాం: నామా
పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టే తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని బీజేపీని కోరామని టీడీపీ తెలంగాణ నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ తెలంగాణ నేతలంతా అద్వానీ, జైట్లీ లను కలిశామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లోపభూయిష్టమైన బిల్లును ప్రవేశపెట్టి, అది పాస్ కాకపోతే... నెపాన్ని బీజేపీపై తోసేసే కుట్ర చేస్తోందని బీజేపీ నేతలు తెలిపారని నామా స్పష్టం చేశారు. తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ నేతలు స్పష్టం చేశారని నామా తెలిపారు.