: సస్పెన్షన్ తో వచ్చే నష్టమేమీ లేదు: రాయపాటి
లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడంపై ఎంపీ రాయపాటి స్పందించారు. సస్పెండ్ చేయడం వల్ల తమకు కలిగే నష్టమేమీ లేదన్నారు. ప్రజల కోసమే సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పారు. అయితే, ఇంకా తనకు అధిష్ఠానం నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. అయినా, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచేందుకు పోరాడుతామని రాయపాటి అన్నారు. ఈ నెల 21 తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని రాయపాటి స్పష్టం చేశారు.