: నిజాయతీ అధికారులను వేధించరాదు: ప్రధాని


పాలనపరమైన తప్పుల విషయంలో నిజాయతీ అధికారులను వేధించరాదని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. పాలనను మెరుగుపరచడమే అవినీతి వ్యతిరేక యంత్రాంగం ఉద్దేశంగా చెప్పారు. ఢిల్లీలో జరిగిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలలో పాల్గొన్న ప్రధాని ఈ మేరకు మాట్లాడారు. దర్యాప్తు సంస్థలు పూర్తి స్వయం ప్రతిపత్తిని అనుభవిస్తున్నాయని చెప్పారు. అవసరమైతే సీబీఐపై వెలుపలి శక్తుల ప్రభావం పడకుండా మరిన్ని చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News