: సీమాంధ్ర నేతలకు మద్దతుగా డీఎంకే, అన్నాడీఎంకే ఎంపీలు
సీమాంధ్ర నేతలు పార్లమెంటు ఉభయసభలను అడ్డుకోవడంలో సఫలమయ్యారు. రాజ్యసభ, లోక్ సభ పోడియంలలో సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సీమాంధ్ర ఎంపీలకు జతగా తమిళనాడుకు చెందిన డీఎంకే, అన్నాడీఎంకే నేతలు కూడా సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. వీరంతా జతకలవడంతో సీమాంధ్ర నేతల బలం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనికి తోడుగా, శ్రీలంకలో ఉన్న తమిళ జాలర్లకు మద్దతుగా ఏఐఏడీఎంకే నిరసన తెలిపింది.