: సంజయ్ దత్ గెస్టుకు సాయం చేసి చిక్కుల్లో పడిన అధికారులు


ప్రభుత్వ నిబంధనలు అందరికీ సమానమే అన్నది రాజ్యాంగ స్ఫూర్తి. కానీ, మహారాష్ట్రలోని యెరవాడ జైలు అధికారులు నిబంధనలు తుంగలో తొక్కారు. సెలబ్రిటీ ఖైదీ సంజయ్ దత్ కోసం రూల్సు బుక్ పక్కనబెట్టి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. విషయం ఏమిటంటే.. ఇటీవలే యెరవాడ జైలు ఖైదీలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, అది కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఆ సమయంలో బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ యెరవాడ జైలుకు వచ్చి సంజయ్ దత్ ను కలిశాడట. సంజయ్ కోసమని నియమావళికి విరుద్ధంగా జైలు అధికారులు హిరానీని లోనికి పంపారు. జైళ్ళ విభాగం అంతర్గత విచారణలో ఈ వ్యవహారం బయటపడింది.

యెరవాడ జైలు సూపరింటిండెంట్ యోగేశ్ దేశాయ్, సీనియర్ జైలర్ చంద్రకాత్ అవాలే.. సంజయ్ దత్ కోసం వచ్చిన హిరానీని లోనికి పంపడమే గాకుండా వాళ్ళిద్దరితో ఫొటోలకు పోజులు కూడా ఇచ్చారు. ఈ ఫొటోలు తర్వాతి రోజు మీడియాలో రావడంతో అధికారుల్లో చలనం వచ్చింది. హోం మంత్రిత్వ శాఖకు నివేదిక పంపామని, త్వరలోనే ఆ ఇద్దరు అధికారులపై చర్యలు ఉండొచ్చని మరో అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News