: నిద్ర బాగా పోతున్నారా? లేదా?


బెడ్ ఎక్కారు, ముసుగు తన్నారు. బారెడు పొద్దెక్కాక లేచారు. ఇదంతా రోటీన్. మరి మీ నిద్రలో అసలైన మజా ఉందా? ఆరోగ్యకరమైన నిద్ర పోతున్నారా? లేదా? చెప్పేందుకు వచ్చేసింది ఓ పరికరం. ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు దీన్ని తయారు చేశారు. నిద్రించే ముందు దిండు కింద ఈ చిన్న పరికరాన్ని పెడితే చాలు. గుండె కొట్టుకునే తీరు, తీసుకునే శ్వాస పరిమాణం తదితర వివరాలను నమోదు చేయడంతోపాటు వాటిని స్మార్ట్ ఫోన్ కు పంపించేస్తుంది. అంటే వైద్యుల సాయం అక్కర్లేకుండానే ఈ పరికరంతో నిద్ర నాణ్యతను తెలుసుకోవచ్చు.

  • Loading...

More Telugu News