: కార్లకు విక్రయించే డీజిల్ ధరను 30 శాతం బాదేయండి: ఓ కమిటీ


డిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందని తేల్చిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ సుప్రీం కోర్టుకు ఇదే విషయమై నిన్న ఒక నివేదికను సమర్పించింది. అందులోనే కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కొన్ని సూచనలు చేసింది. డీజిల్, సీఎన్ జీ ఇంధన ధరలు ఒకేలా ఉండడంతో.. డీజిల్ కార్ల కొనుగోళ్లు బాగా పెరిగాయని పేర్కొంది. 2002-03లొ డీజిల్ ధర కంటే సీఎన్ జీ ధర 47 శాతం తక్కువ ఉంటే, గత డిసెంబర్ నాటికి ఆ తేడా 7శాతానికి దిగివచ్చిందని తెలిపింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత కార్లకు విక్రయించే డీజిల్ పై 30శాతం సర్ చార్జీ వసూలు చేయాలని సూచించింది. అలాగే, డీజిల్ కార్ల రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా పెంచాలని కోరింది. అదే సమయంలో డీజిల్ బస్సుల రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించాలని నివేదికలో పేర్కొంది.

  • Loading...

More Telugu News