: పల్లెలు, పట్టణాలతో పాటు జంట నగరాల్లోనూ పవర్ కట్
రాష్ట్రంలో పల్లెలు, పట్టణాల్లోనే కాదు.. రాజధాని నగరంలోనూ విద్యుత్ కోత విధిస్తున్న విషయం విదితమే. అయితే, ఈసారి ముందుగా విద్యుత్ కోతలు విధించేసి, ఆనక తీరిగ్గా విద్యుత్ సంస్థలు అధికారిక ఉత్తర్వులు జారీ చేశాయి. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో రెండు గంటలు, జిల్లా కేంద్రాల్లో 4 గంటలు విద్యుత్ కోత విధించాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. పట్టణాలు, మున్సిపాలిటీల్లో 6 గంటలు, మండల కేంద్రాల్లో అయితే, ఏకంగా 8 గంటలు కరెంట్ కోత విధించాలని విద్యుత్ సంస్థలు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి.