: మోడీ దూకుడుకు దిగి వస్తున్న అగ్రరాజ్యం
2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో, గుజరాత్ ముఖ్యమంత్రి మోడీని అమెరికా బ్లాక్ లిస్టులో ఉంచింది. ఈ క్రమంలో 2005లో మోడీ వీసాను అగ్రరాజ్యం రద్దు చేసింది. అనంతరం మోడీ విషయంలో ఏనాడూ అమెరికా తన వైఖరిని మార్చుకోలేదు. కానీ, మారుతున్న పరిణామాల నేపథ్యంలో, అగ్రరాజ్యం తన విధానాలను మార్చుకోక తప్పని పరిస్థితి తలెత్తింది. అమెరికాలో అత్యంత ప్రఖ్యాతి గాంచిన 'టైమ్' పత్రిక తన సంపాదకీయంలో... మోడీ భారత ప్రధాని అయిన తర్వాత కూడా వీసాను నిరాకరించగలరా? అంటూ అమెరికా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ వ్యాసం అమెరికాలో సంచలనాన్ని రేపింది. ఈ నేపథ్యంలో, భారత్ లోని అమెరికా రాయబారి నాన్సీ పావెల్ ఈనెల 14న మోడీతో గాంధీనగర్ లో భేటీ కానున్నారు. అంతే కాకుండా, వీసా కోసం మోడీ దరఖాస్తు చేసుకోవచ్చంటూ అమెరికా సీనియర్ అధికారి తెలిపారు.