: కొత్త వాళ్లతో వందకోట్ల సినిమా తీయలేం: రోహిత్ శెట్టి


బాలీవుడ్ కామెడీ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి చేసింది తక్కువ సినిమాలయినా, అందులో రెండు చిత్రాలు 'వంద కోట్ల' మార్కును అధిగమించాయి. దాదాపు స్టార్ హీరో, హీరోయిన్లతోనే రోహిత్ తన చిత్రాలు చేశాడు. వాటిలో షారుక్ ఖాన్ తో 'చెన్నై ఎక్స్ ప్రెస్', అజయ్ దేవగణ్ తో 'బోల్ బచ్చన్' చిత్రాలున్నాయి. అయితే, కొత్త వాళ్లతో ఓ చిత్రం రూపొందించి వందకోట్లు రాబట్టడం కష్టమని చెప్పాడు. అదే సమయంలో సొంత డబ్బు పెడితే ఇంకా కష్టమన్నాడు. కాగా, సరైన స్క్రిప్టు, బడ్జెట్ దొరికినప్పుడు కొత్తవాళ్లతో తీస్తానంటున్నాడు. అది కూడా ఆ స్ట్రిప్టుకు కొత్తవాళ్లు అవసరమని భావిస్తే బడ్జెట్ గురించి ఆలోచించనని తెలిపాడు.

  • Loading...

More Telugu News