: ఎల్లుండి నుంచే ‘మహా జాతర’... అన్ని ఏర్పాట్లు పూర్తి


బుధవారం నుంచే మహా జాతర ప్రారంభమవుతోంది. వరంగల్ జిల్లాలో జరిగే మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లాలోని మేడారానికి మూడు రోజుల ముందు నుంచే భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాదు నగర వాసులు మేడారానికి వెళ్లారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జంట నగరాల నుంచి మేడారానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది.

మేడారం జాతరకు వెళ్లేందుకు నగర వాసులు సొంత వాహనాల్లో కూడా వెళుతున్నారు. దీంతో ప్రయాణానికి వీలుగా మేడారానికి వెళ్లే దారిలో కొన్ని చోట్ల రోడ్డు విస్తరణ కార్యక్రమాలు కూడా పూర్తి చేసినట్లు అధికారులు చెప్పారు. మేడారం ప్రాంతానికి సమీపంలో కారు పార్కింగ్, భక్తులకు అవసరమైన తాగునీటి ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News