: హెలి స్కాంలో మరో రెండు కంపెనీలపై దృష్టి పెట్టిన సీబీఐ
సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల స్కాంలో తవ్వేకొద్దీ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.3600 కోట్ల మేర చోటు చేసుకున్న ఈ భారీ కుంభకోణంలో మరో రెండు కంపెనీల పాత్రపై సీబీఐ ప్రాథమిక ఆధారాలు సంపాదించింది. ఈ మేరకు ఆ రెండు సంస్థలపై లోతుగా విచారించాలని సీబీఐ నిర్ణయించింది. మారిషస్, సింగపూర్ కు చెందిన ఈ రెండు కంపెనీలకు పోర్ట్ లూయిస్ లోని స్టెల్లార్ టెక్నాలజీస్ నుంచి నిధులు బదిలీ అయ్యాయి. దీని ఆధారంగా దర్యాప్తులో స్పష్టత వచ్చే అవకాశముందని సీబీఐ వర్గాలంటున్నాయి. హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో చెల్లింపులకు సంబంధించి ఓ జాబితా రూపొందించాలని సీబీఐ భావిస్తోంది. ఈ మేరకు ఆ రెండు కంపెనీల నిగ్గు తేల్చేందుకు మారిషస్, సింగపూర్ దేశాల ప్రభుత్వాలకు సీబీఐ లెటర్ రొగేటరీ (విదేశాలను న్యాయసహాయం కోరుతూ రాసే లేఖ) పంపింది.