: ఢిల్లీలో రేపు మోడీ విందు.. పార్టీ ఎంపీలందరికీ ఆహ్వానం


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఢిల్లీలో రేపు పార్టీ ఎంపీలందరికీ భారీ విందు ఇవ్వబోతున్నారు. నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలవనున్న నేపథ్యంలో పార్టీ నేతలందరూ హుషారుగా, ఉత్సాహంగా పిచ్చాపాటిగా మాట్లాడుకునేందుకు ఈ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో రేపు సాయంత్రం 8 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, అగ్రనేతలు ఎల్ కే అద్వానీ, సుస్మాస్వరాజ్ సహా బీజేపీకి మొత్తం 117 మంది లోక్ సభ సభ్యులు, రాజ్యసభలో 47 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా మోడీ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 20న పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. ఆ వెంటనే అంటే ఓ పదిహేను రోజుల తేడాతో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది. అప్పటినుంచి బీజేపీ నేతలంతా ప్రచారం, మిగతా హడావుడిలో ఉంటారు. దాంతో, ముందుగానే వాటిపై రేపటి విందులో చర్చించుకునే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News