: గాదెకు తెలంగాణ మహిళా మంత్రుల 'టిట్ ఫర్ టాట్'
కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి, తెలంగాణ ప్రాంత మహిళా మంత్రుల మధ్య అసెంబ్లీ ప్రాంగణంలో అసక్తికర వాగ్వాదం చోటు చేసుకుంది. కేబినెట్ భేటీకి ఎందుకు రాలేదని మంత్రులు డీకే అరుణ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను గాదె వెంకటరెడ్డి అడిగారు. దీనికి సీఎంపై నిరసన తెలిపేందుకే తాము కేబినెట్ భేటీకి హాజరుకాలేదని వారు సమాధానమిచ్చారు. అంత వ్యతిరేకత ఉన్నప్పుడు పదవులకు రాజీనామా చేసి నిరసన తెలపొచ్చుకదా? అని గాదె రెట్టించారు. దీంతో మీరెందుకు రాజీనామాలు చేసి అధిష్ఠానానికి వ్యతిరేకంగా డిల్లీలో దీక్ష చేయలేదు? అని వారు ప్రశ్నించారు.