: సికింద్రాబాద్-తిరుపతి మధ్య డబుల్ డెక్కర్ రైలు: కోట్ల
పది రోజుల్లో సికింద్రాబాద్, తిరుపతి మధ్య డబుల్ డెక్కర్ రైలు (రెండతస్తులు)ను ప్రారంభించేందుకు సమాయత్తం అవుతున్నామని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో ఆయన నిన్న మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. జాతీయ రహదారుల వలే భవిష్యత్తులో రైల్వే మార్గాలను కూడా నాలుగు వరుసలుగా విస్తరించే యోచనలో ఉన్నామని తెలిపారు. కర్నూలులో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని పేర్కొన్నారు.