: భద్రచలం డివిజన్ లో అడుగు జాగా వదలం: బలరాం నాయక్
భద్రచలం డివిజన్ లో అడుగు జాగా కూడా వదిలేది లేదని కేంద్ర మంత్రి బలరాం నాయక్ అన్నారు. మేడారం జాతరకు వచ్చిన ఆయన మాట్లడుతూ, అవసరమైతే పోలవరం డ్యాం డిజైన్ మార్చుకుని ఎత్తు తగ్గించుకోవాలి. అంతేకానీ, భద్రాచలం డివిజన్ లో ఒక్క అడుగును కూడా సీమాంధ్రకు వదిలేదని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని గిరిజన గ్రామాలను ముంచి ప్రాజెక్టు కడతామంటే తాము ఒప్పుకోమని ఆయన తెలిపారు. తెలంగాణను ఆపేందుకు చంద్రబాబు నాయుడు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నాడని, తెలంగాణ టీడీపీ నేతలు దీనిని గుర్తించాలని ఆయన కోరారు. ఎయిమ్స్ స్థాయిలో అదిలాబాద్ రిమ్స్, ఎంజీఎం ఆసుపత్రులను అభివృద్ధి చేస్తానని, వచ్చే రైల్వేబడ్జెట్ లో డోర్నకల్ లో వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు చేసేలా ఒత్తిడి తెస్తానని బలరాం నాయక్ వెల్లడించారు.