: రూ. 1,83,129 కోట్లతో బడ్జెట్


2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 1,83,129 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సభకు సమర్పించారు. ప్రణాళికా వ్యయం 67,950 కోట్లుగా పేర్కొన్నారు. ప్రణాళికేతర వ్యయం 1,15,179 కోట్లుగా ఉంది. అలాగే, రెవెన్యూ మిగులును 474కోట్లుగా చూపించారు. ద్రవ్యలోటు 25,402 కోట్లుగా చూపారు. 2013 నాటికి 19.4 లక్షల ఆయకట్టుకు కొత్తగా సాగునీటి వసతిని కల్పించామని చెప్పారు. 8.97 లక్షల స్వయం సహాయక మహిళా సంఘాలకు పావలా వడ్డీ కింద 2,659 కోట్ల రుణాలు ఇచ్చామని చెప్పారు. 20,346 కొత్త ఉద్యోగాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కల్పించామన్నారు.

  • Loading...

More Telugu News