: హరీష్ రావు, కోదండరాంలకు నైతికత లేదు: జగ్గారెడ్డి


ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద తెలంగాణ ప్రాంత మహిళా మంత్రులకు అవమానం జరిగిందని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. మౌన దీక్షకు వెళ్తున్న సీఎం కిరణ్ ప్రమేయం లేకుండానే ఆ ఉదంతం చోటు చేసుకుందని అన్నారు. గతంలో మంత్రి గీతారెడ్డి నివాసంలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేసినప్పుడు హరీష్ రావు ఏమయ్యారని ప్రశ్నించారు. ఈశ్వరీబాయి కడుపున చెడపుట్టారని గీతారెడ్డిని కోదండరాం విమర్శించినప్పుడు ఆయన నైతికత ఏమయిందని నిలదీశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ కొట్టుకుపోతుందని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News