: జగన్, సబ్బం హరిల మధ్య ఆసక్తికర సంభాషణ
మొదట్లో జగన్ వెన్నంటి ఉన్న అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, ఈమధ్య కాలంలో వైఎస్సార్సీపీకి దూరమవడమే కాకుండా... ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు, జగన్ కు మధ్య జరిగిన ఓ సంభాషణను సబ్బం హరి మీడియాకు వివరించారు. పార్లమెంటులో జగన్ తనను కలిశారని, నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారన్నా? అని అడిగారని... దీనికి సమాధానంగా, జరిగిందంతా మీకు తెలుసు... దీనికి సమాధానం కూడా మీరే చెప్పాలని బదులిచ్చానని ఎంపీ సబ్బం తెలిపారు.