: మెరికల్లాంటి విద్యార్థులను మనమే అట్టిపెట్టుకోవాలి: రాష్ట్రపతి
భారత విద్యావ్యవస్థపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పెదవి విరిచారు. ప్రపంచ టాప్ 200 యూనివర్శిటీల్లో ఒక్క భారత వర్శిటీ కూడా లేకపోవడం విచారకరమని అభిప్రాయపడ్డారు. మెరికల్లాంటి విద్యార్థులను భారత విద్యాసంస్థలే అట్టిపెట్టుకోవాలని సూచించారు. ముంబయిలోని కిషన్ చంద్ చెల్లారామ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్ డైమండ్ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అమర్త్యసేన్, హరగోవింద్ ఖురానా, చంద్రశేఖర్, వెంకటరామన్ వంటి నోబెల్ విజేతలు భారతీయ వర్శిటీల్లోనే చదివారని, కానీ, యూఎస్, యూకే వంటి దేశాల్లోని యూనివర్శిటీల్లో పరిశోధనలు చేపట్టారని వివరించారు. మన వ్యవస్థలో ప్రతిభావంతులైన విద్యార్థులతో పాటు ప్రభావశీలురైన గురువులను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ప్రణబ్ నొక్కి చెప్పారు.