: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఎన్వీ రమణ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జస్టిస్ ఎన్.వి.రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గతంలో రాష్ట్ర హైకోర్టుగా పనిచేసిన ఆయన, ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. కృష్ణాజిల్లాలోని పొన్నవరం గ్రామంలో 1957, ఆగస్టు 27న రైతు కుటుంబంలో పుట్టిన జస్టిస్ ఎన్వీ రమణ, 1983 ఫిబ్రవరి 10వ తేదీన న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. రాష్ట్ర హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునళ్లు, సుప్రీంకోర్టులో సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, సేవ, ఎన్నికల అంశాలపై ఆయన పలు కేసులు వాదించారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు ఆయన ప్యానల్ న్యాయవాదిగా కూడా ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ కు అదనపు అడ్వకేట్ జనరల్ గా కూడా వ్యవహరించారు. రాష్ట్ర హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా 2000 జూన్ 27న పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2013 సెప్టెంబరు వరకు రాష్ట్ర హైకోర్టులోనే పనిచేసి, తర్వాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లారు. ఇప్పుడు పదోన్నతి పొంది, సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.

  • Loading...

More Telugu News