: విజయవాడలో దొంగనోట్ల ముఠా గుట్టురట్టు
విజయవాడలో దొంగ నోట్లను చలామణి చేస్తున్న ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితులను కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 7.33 లక్షల నకిలీ నోట్లు, కలర్ ప్రింటర్, స్కానర్, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.