: స్పర్శ తెలిపే కృత్రిమ హస్తం


ఇప్పటివరకు వికలాంగులకు అమర్చే కృత్రిమ హస్తం, కాలు వంటివి కేవలం అలంకారప్రాయమే. ముఖ్యంగా కృత్రిమ హస్తంతో ఏ పనులూ చేయలేము కూడా. దాంతో దేన్నైనా తాకినా మెదడుకు సంకేతాలు చేరవు. తద్వారా స్పర్శ తెలీదు. తాజాగా యూరోపియన్ సైంటిస్టులు సరికొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చారు. వారు తయారు చేసిన ఆర్టిఫిషియల్ హ్యాండ్ తో దేన్నయిన ముట్టుకుంటే అది మానవ హస్తంలాగే మెదడుకు సంకేతాలు చేరవేసి, స్పర్శను అనుభవంలోకి తెస్తుందట. డెన్మార్క్ కు చెందిన ఓ వ్యక్తికి ఈ కొత్త చేయిని అమర్చి విజయవంతంగా పరీక్షించారు పరిశోధకులు. కృత్రిమ హస్తంలో అల్ట్రాథిన్, అల్ట్రా ప్రిసైజ్ ఎలక్ట్రోడ్లు అమర్చి వాటిని, మోచేయి పైభాగంలోని నాడులకు సంధానించడంలో శాస్త్రవేత్తలు సక్సెసయ్యారు. తద్వారా ఈ చేయితో దేన్నైనా తాకినప్పుడు ఎలక్ట్రికల్ సిమ్యులేషన్ ద్వారా సంకేతాలు నాడీ వ్యవస్థకు చేరి అక్కడి నుంచి మెదడుకు అందుతాయని పరిశో్ధకులు తెలిపారు.

  • Loading...

More Telugu News